ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పొటెత్తాయి. ఈ వరదల కారణంగా 63 మంది చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపుగా రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వరదలో మృతిచెందిన వారి సంఖ్య వందకు పైగా ఉంటుందని స్థానిక మీడియా అంచనా వేస్తోంది.
మండి జిల్లా నుంచి 17, కాంగ్రా(13), చంబా(06), సిమ్లా(05) ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి పైగా గాయపడినట్టు సమాచారం. భయకరంగా వరదలు పొటెత్తడంతో వందలాది ఇండ్లు ధ్వంసం కావడంతో పాటు 14 వంతెనాలు కొట్టుకొనిపోయాయి. కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడడంతో పాటు వేల మంది ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.