- Advertisement -
అస్సాం రాష్ట్రంలో పర్యటించే వాళ్లకు అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. ఈ విషయంపై సిఎం హేమంత బిశ్వశర్మ (Himantha Biswa Sarma) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా అస్సాంకి వచ్చే ‘కొత్త వ్యక్తులు’ రాష్ట్రాన్ని సందర్శించాలని, రాజకీయాల అంశాలపై, సున్నితమైప అంశాలను మాట్లాడితే వాళ్లను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. కేరళ, ముంబై, ఢిల్లీ.. ఇలా ఏ ప్రాంతనానికి చెందిన వారికైన ఈ నిబంధనలు వర్తిస్తామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో పర్యటించే వారిపై నిఘా ఉంటుంది. ఎన్‌ఆర్‌సి ఆప్‌డేషన్ సమయంలోనూ కొందరు గందరగోళం సృష్టించారు. అప్పుడు వారిపై అంతగా దృష్టి పెట్టలేదు. కానీ, ఇప్పుడు మాత్రం అలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచుతాం. నిబంధనలు దాటి ప్రవర్తిస్తే.. ఎవరైనా సరే అరెస్ట్ చేసి తీరుతాం’’ అని హిమంత పేర్కొన్నారు.
- Advertisement -