Sunday, May 4, 2025

ఈ నెల 14న కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ వెల్లడించారు. సుమారు లక్ష మందితో హిందూ ఏక్తా యాత్ర చేపడతామన్నారు. ఏక్తా యాత్రలో అసొం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ, రాష్ట్ర పార్టీ బాధ్యులు తరుణ్ చుగ్,

బిజెపి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామని బండి సంజయ్ తెలిపారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News