Monday, August 18, 2025

‘హలగలి’ చరిత్రలో ఒక అధ్యాయం

- Advertisement -
- Advertisement -

హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో సుకేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీశ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. (Halagali) ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. గ్రాండ్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ సినిమా గ్లింప్స్‌ని లాంచ్ చేశారు మేకర్స్. ప్రెస్ మీట్‌లో హీరో డాలీ ధనంజయ మాట్లాడుతూ.. ‘హలగలి అన్ టోల్ స్టోరీ. ఈ సినిమాలో పార్ట్ కావడం గర్వంగా భావిస్తున్నాను. నిర్మాత కళ్యాణ్, డైరెక్టర్ సుకేష్ చాలా ప్యాషన్‌తో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. ఈ గ్లింప్స్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘హలగలి చరిత్రలో ఒక అధ్యాయం. బ్రిటిష్‌కి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చిరస్మరణీయం. కన్నడలో పదో తరగతి పాఠ్యాంశంలో  (tenth grade curriculum) కూడా ఇది ఉంది. దీని గురించి చాలామంది రీసెర్చ్‌లు చేశారు. ఈ సినిమా గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇది ఒక పార్ట్‌లో చెప్పాల్సింది కాదు. రెండు పార్టులుగా చెప్పాల్సిన కథని అప్పుడే నిర్ణయించుకున్నాము. సినిమాలో డాలీ గారి క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా అద్భుతంగా ఉండబోతుంది. సప్తమిది మాస్ క్యారెక్టర్’ అని తెలిపారు. డైరెక్టర్ సుకేష్ మాట్లాడుతూ.. ‘40 శాతం షూటింగ్ పూర్తయింది. ఇది ఒక పార్ట్‌లో చెప్పే కథ కాదు. ఈ కథ వెనుక చాలా గొప్ప చరిత్ర ఉంది. అందుకే రెండు పార్ట్స్‌గా తీసుకొస్తున్నాము’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో హీరోయిన్ సప్తమి గౌడ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News