Saturday, May 3, 2025

బాక్సాఫీస్ వద్ద ‘హిట్ 3’ జోరు.. తొలి రోజు భారీ కలెక్షన్స్

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హిట్ 3. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ  సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ తెచ్చుకుంది. దీంతో బాక్సీఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడతోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 43 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాని కెరీర్ లోనే తొలి రోజు భారీ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా హిట్ 3 నిలిచింది. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇప్పటికే నాని నటించిన దసరా మూవీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News