- Advertisement -
నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘హిట్ 3’. వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 29 నుంచి ‘హిట్ 3‘ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మే 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వరకు ఈ మూవీ కలెక్ట్ చేసి నాని కెరీర్ లోనే అత్యధిక వసూల్ చేసిన చిత్రంగా నిలిచింది.
- Advertisement -