నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘హిట్ : ది థర్డ్ కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. తాజాగా పాన్ ఇండియా మూవీగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-హిట్ సెకండ్ పార్ట్‌లోనే నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చివర్లో ఒక గ్లింప్స్ లాగా చూ పించా. అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడో అప్పుడే ఆడియన్స్ కి ఒక అవగాహన వచ్చింది. ఈ తరహా పాత్రకు ఎలాంటి క్యారెక్టరైజేషన్ కావాలో అలా డిజైన్ చేయడం జరిగింది.-ఈ సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారని ముందు అనుకున్నాం.
అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లేడీస్‌కి ఎక్కువగా నచ్చడం మాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ముఖ్యంగా థియేటర్స్‌లోకి ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు. పిల్లల్ని తీసుకురావడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యంగా అనిపించింది. హీరో క్యారెక్టర్ మీద నాకు, నానికి మొదటి నుంచి నమ్మకం వుంది. సినిమాకు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. -‘హిట్ 4’లో కార్తీ క్యారెక్టర్ ఏంటి అనేది నాకు ఐడియా ఉంది. ఇప్పటికే సినిమాలో చూపించాం. తనకి క్రికెట్ అంటే ఇష్టం, బెట్టింగ్స్ వేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ కొంచెం విభిన్నంగా ఉండబోతుంది. క్యారెక్టర్‌లో ఫన్ కూడా ఉంటుంది. రావు రమేష్ హిట్ 2లో చేశారు. ఆయన కథ కూడా వినకుండా ఎంత చిన్న క్యారెక్టర్ అయినా వచ్చి చేస్తానని చెప్పారు.
అలాగే సముద్రఖని కూడా చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించారు. సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్‌కి శ్రీనిధి శెట్టి సరిగ్గా సరిపోయింది. తను అద్భుతంగా నటించింది. ఆమె నటనని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. నాని ప్రొడ్యూసర్, హీరో అవడం చాలా కలిసొచ్చింది. ఆయనకి సినిమాకి ఏం కావాలో తెలుసు. వాల్ పోస్టర్ నాకు హోం బ్యానర్ లాంటి ప్రొడక్షన్ హౌస్. -నెక్స్ మూడు, నాలుగు నెలలు సిడ్నీలో కూర్చుని ఒక రొమాంటిక్ కామెడీ రాసుకోవాలని ఉంది. నా లోపల ఉన్న కామెడీని బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి రాయాలని ఉంది. మరి అది ఎంతవరకు కుదురుతుందో చూడాలి”అని అన్నారు.