Monday, May 12, 2025

‘హిట్-3’ ఊహించిన దానికంటే బిగ్ సక్సెస్‌ను అందుకుంది

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘హిట్ : ది థర్డ్ కేస్’.( Hit Third Case)  శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “హిట్ 3 సినిమా విషయానికొస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాలా సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. దర్శకుడు శైలేష్ తో వర్క్ చేయడం చాలా ఫన్ గా ఉంటుంది.

తను చాలా కూల్ గా పని చేసుకుంటూ వెళ్తాడు. తను ప్రతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు. తనకి హిలేరియస్ కామెడీ టైమింగ్ ఉంది. తనతో నేను చేయబోయే నెక్స్ సినిమా మాత్రం మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక హిట్ 3 వండర్‌ఫుల్ జర్నీ. 2025 అటు కోర్ట్ ఇటు హిట్ 3.. మరచిపోలేని సంవత్సరమిది”అని అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ హిట్ 3 సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని తెలియజేశారు. ప్రొడ్యూసర్ దీప్తి మాట్లాడుతూ “నాని హీరోగా చాలా గొప్పగా ఎదిగాడు. ఎప్పటికప్పుడు తనని కొత్తగా మలుచుకుంటున్నాడు. నానిని చూస్తే గర్వంగా ఉంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ “నాని అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన వ్యక్తితో జర్నీ చేసినప్పుడు అనుకున్న స్థాయికి చేరుకోవాలని ప్రతి రోజు హార్డ్‌వర్క్ చేశాం. నానితో ‘ఐయాం ప్రౌడ్ ఆఫ్ యు శైలేష్’ అనిపించుకోవడం గ్రేట్ మూమెంట్‌”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, పావని, శ్రీనాథ్ మాగంటి, అమిత్, నాగేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News