Tuesday, August 26, 2025

‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్

- Advertisement -
- Advertisement -

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహ న్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ‘టాక్సిక్’ టీం ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డే షిఫ్ట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె.పెర్రీని రంగంలోకి దించారు. హాలీవుడ్ టీంతో ఇప్పటి వరకు ‘టాక్సిక్’లో అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌లను జె.జె.పెర్రీ చిత్రీకరించారు. ఇప్పుడు జె.జె. పెర్రీ ఇండియన్ స్టంట్ టీంని తీసుకుని ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘమైన షెడ్యూల్‌లో కేవలం ఇండియన్ స్టంట్ టీం మాత్రమే పని చేయనుంది. ఇండియన్ స్టంట్ టీం టాలెంట్ చూసి అబ్బురపడిన జె.జె. పెర్రీ తన టీంను పక్కన పెట్టారట. ఇంత వరకు హాలీవుడ్ టీంతోనే జె.జె. పెర్రీ పని చేయగా.. ఇప్పుడు ‘టాక్సిక్’ కోసం ఇండియన్ స్టంట్ టీంను తీసుకున్నారు.

ఈ మేరకు జె.జె. పెర్రీ మాట్లాడుతూ.. “ఈ ఇండియన్ స్టంట్ టీం వర్డల్ క్లాస్‌గా ఉంది. మేము ప్రస్తుతం ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరించబోతోన్నాం. ఇది ఒక సవాల్‌లాంటిది. నాకు ఇలాంటి ఛాలెంజ్‌లు అంటే చాలా ఇష్టం. ఈ టీంతో కలిసి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాను. మేమంతా కలిసి సరిహద్దుల్ని చెరిపేసేలా అంతర్జాతీయ స్థాయిలో ‘టాక్సిక్’ను రూపొందిస్తాం. యశ్, గీతూ మోహన్ దాస్, వెంకట్‌తో పని చేయడం ఆనందంగా ఉంది”అని అన్నారు. కన్నడ, ఆంగ్లంలో ఒకేసారి చిత్రీకరిస్తున్న మొట్టమొదటి హై బడ్జెట్ ద్విభాషా చిత్రం ‘టాక్సిక్’ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా ఇతర భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News