- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫార్మ్ మ్యాజిక్‌బ్రిక్స్ నివేదిక ప్రకారం, భారత హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ ప్రస్తుతం 12.33 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, 12 శాతం వృద్ధితో 2030 నాటికి 24.52 బిలియన్ డాలర్ల చేరనుంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, వినియోగదారుల అభిరుచులు కారణమని అధ్యయనం పేర్కొంది. బాగా డిజైన్ చేసిన ఇంటీరియర్స్ ఆస్తి రీసేల్ విలువను 70 శాతం పెంచి, అద్దెలను 45 శాతం పెంచుతాయని నివేదిక తెలిపింది. 2-3 బిహెచ్‌కె ఇళ్లు, మధ్యశ్రేణి గృహాలు ప్రధాన డిమాండ్ విభాగాలుగా ఉన్నాయని వెల్లడించింది. ఇంటీరియర్స్‌పై సగటు ఖర్చు చదరపు అడుగుకు రూ.560గా ఉండగా, ఢిల్లీ ఎన్‌సిఆర్ ముందంజలో ఉంది.
- Advertisement -