Thursday, August 21, 2025

హనీ ట్రాప్‌తో వృద్ధుడిని దోచుకున్న సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

హనీ ట్రాప్‌తో నగరంలోని అమీర్‌పేటకు చెందిన వృద్ధుడిని నిండాముంచారు సైబర్ నేరస్థులు. వృద్దుడికి మాయమాటలు చెప్పి రూ.7.11లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అమీర్‌పేటకు చెందిన వృద్ధుడు(81)కి జూన్, 2025లో ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ వచ్చాయి. అందులో ఓ యువతి తన పేరు మాయా రాజ్‌పుత్‌గా పరిచయం చేసుకుంది. అప్పటి నుంచి నిందితులు వృద్ధుడికి ఫోన్ చేసి కవ్విస్తు మాట్లాడేవారు. వీరి మాటలకు పడిపోయిన బాధితుడు వారు చెప్పినట్లు చేశాడు. మెడికల్ ట్రీట్‌మెంట్, ప్లాట్ రిజిస్ట్రేషన్, జూవెల్లరీ విడిపించుకునేందుకు, ఫర్నీచర్ కొనుగోలు పేరు చెప్పి పలు మార్లు వృద్ధుడి వద్ద నుంచి 7.11లక్షలు కొట్టేశారు. తమతో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులకు చెబుతామని బెదిరించి డబ్బులు అడగడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News