Sunday, September 14, 2025

హాంకాంగ్ ఓపెన్ 2025.. ఫైనల్లో లక్షసేన్

- Advertisement -
- Advertisement -

హాంకాంగ్: ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ లక్షసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ఫైనల్ పోరుకు చేరుకుంది. సింగిల్స్‌లో లక్షసేన్ అసాధారణ ఆటతో అదరగొట్టాడు. తైవాన్ షట్లర్ చౌ టిన్ చెన్‌తో శనివారం జరిగిన హోరాహోరీ సెమీ ఫైనల్లో సేన్ 2321, 2220 తేడాతో విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్న చౌ చెన్‌తో జరిగిన పోరులో సేన్ అద్భుత ఆటను కనబరిచాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది.

ఇటు చెన్ అటు సేన్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇద్దరు ఆటగాళ్లు సర్వం ఒడ్డడంతో రెండు సెట్లలో కూడా ఉత్కంఠత తప్పలేదు. ఆసక్తికరంగా సాగిన మొదటి సెట్‌లో సేన్ 2321 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. రెండో సెట్ కూడా నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఈసారి కూడా ఇద్దరి సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో ఈ సెట్ కూడా టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు నిలకడగా ఆడడంలో సఫలమైన సేన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు.ఆదివారం జరిగే తుది సమరంలో చైనాకు చెందిన లి షిఫెంగ్‌తో సేన్ తలపడుతాడు.

అదరగొట్టిన సాత్విక్ జోడీ..
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ జంట 2117, 215 తేడాతో తైవాన్‌కు చెందిన లిన్ బింగ్, చెన్ చెంగ్ కువాన్ జోడీని ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ రెండు సెట్లలోనూ నిలకడైన ఆటను కనబరిచిన సాత్విక్ జోడీ మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరడం సాత్విక్ జోడీకి ఇదే తొలిసారి కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News