Friday, July 18, 2025

ఆగస్టు మొదటి వారంలో మొదటి పాట

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ (The Rajasaab) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్‌కి మ్యూజికల్ ట్రీట్ సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది.

సినిమా ఇంట్రో గ్లింప్స్ నుంచి టీజర్ వరకు తమన్ ఇచ్చిన బీట్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి రంగం సిద్ధం (Prepare field) చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు మొదటి వారంలో మొదటి పాటని విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలిసింది. అలాగే ఈ ఫస్ట్ సింగిల్ కూడా ప్రభాస్ పై డిజైన్ చేసిన సోలో సాంగ్ అన్నట్టుగా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ది రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News