Sunday, May 18, 2025

సరికొత్త హారర్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠభరితమైన కథ, కథనంతో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్యప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ దర్శకుడు జీవీకే సరికొత్త హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అన్నారు. దర్శకుడు జివికె మాట్లాడుతూ ఏపి, తెలంగాణ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News