- Advertisement -
నెల్లూరు: ఆర్ఎన్ఆర్ ప్రైవేట్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని తీవ్ర మనోవేదనకు గురైయ్యారు. కళాశాల ఎదుట కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలతో నిరసన చేపట్టారు. కళాశాల అద్దాలు, ఫర్నిచర్ విద్యార్థి సంఘాల నేతలు ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆర్ఎన్ఆర్ కళాశాలకు చేరుకుని, ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తదుపరి యాజమాన్యం విద్యార్థులను కళాశాల నుంచి ఇళ్లకు పంపించేశారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -