- Advertisement -
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా ‘కింగ్డమ్’. ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. ‘హృదయం లోపల’ అంటూ సాగే ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియో సాంగ్ సినిమాపపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -