ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జీప్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. విక్రయాలను పెంచడానికి, పాత కార్ల స్టాక్ క్లియర్ చేయడానికి జీప్ ఇండియా ఆకర్షణీయమైన సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు జీప్ ఇండియా ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ప్రకటించిందో చూద్దాం.
జీప్ కంపాస్
ఈ వాహనం (ఎక్స్ షోరూమ్) ధర రూ. 18.99 లక్షల నుంచి రూ. 32.41 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ SUV పై దాదాపు రూ.2.95 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. జీప్ కంపాస్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ చూస్తే.. ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం వంటివి ఉన్నాయి.
జీప్ గ్రాండ్ చెరోకీ
ఈ కారు ధర రూ.67.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. అయితే ఈ నెలలో జీప్ గ్రాండ్ చిరోకిని కొనుగోలు చేస్తే దాదాపు మూడు లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 272 హార్స్‌పవర్, 400 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.