ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 15 శాతం మేరకు తగ్గిన నేపథ్యంలో టాటా మోటార్స్ అమ్మకాలను పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. హారియర్ ఈవీపై దాదాపు లక్ష రూపాయల డిసౌంట్లను ప్రకటించింది.అయితే ఈ పరిమిత ఆఫర్ కేవలం ఎంపిక చేసిన వేరియంట్లపైన కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంటుంది.టాటా వాహన యజమానులకు లాయల్టీ ప్రయోజనాలు లభిస్తాయి.టాటా టియాగో లాంగ్‌రేంజ్ వేరియంట్‌పై రూ. 40 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వినియోగదారులు తమ పాత కారును అమ్మే సమయంలో రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్,
రూ.20 వేలు ఎక్స్‌చేంజ్ బోనస్‌గా పొందవచ్చు. కంపెనీ టాటా పంచ్ ఈవీపైనా ఇదేతరహా డీల్‌ను అందిస్తోంది.అలాగే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీల్లో ఒటైన టాటా నెక్సాస్‌పైనా రూ.30 వేల ఎక్స్‌చేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అదనంగా లాయల్టీ ప్రయోజనాలు, 6 నెలల పాటు టాటాపవర్ చార్జింగ్ స్టేషన్లలో వెయ్యి యూనిట్ల ఉచిత చార్జింగ్‌ను అందిస్తోంది. టాటా కర్వ్ ఈవీపై కొనుగోలుదారులు రూ.50 వేల వరకు ఎక్స్‌చేంజి బోనస్‌తో పాటు లాయల్టీ రివార్డు పొందవచ్చు. అలాగే మొదటి వెయ్యి కొనుగోలుదారులకు టాటా పవర్ చార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలల పాటు ఉచిత చార్జింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది.