- Advertisement -
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం వరకు ఇన్ ప్లో 2994 క్యూసెక్కులు వచ్చి చేరగా, సాయంత్రానికి వరద భారీగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.411 టీఎం సీల నీరు నిల్వ ఉంది. అందులో సింగూరు ఎడమ కాల్వ ద్వారా 60 క్యూసెక్కులు, తాలెల్మ ఎత్తిపోతల పథకానికి 33 క్యూసెక్కులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, 390 క్యూసెక్కులు ఆవిరైపోతున్నదని పాజెక్టు డిఈ నాగరాజు తెలిపారు. దిగువకు వెళ్తున్న వరద 633 ఉంటుందని దిగువ ప్రాంతాన మత్స్యకారులు గాని పశుకాపరులు కానీ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
- Advertisement -