Saturday, July 5, 2025

జూరాల 14 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకళను సంతరించుకున్నాయి. శుక్రవారం ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి మట్టం 129.72 టిఎంసిలకు గాను 90.91 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 94,767 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు 1,00,670 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 37.646 టిఎంసిలకు గాను 30.98 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి 99,583 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 99,583 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూరాల జలాశయం 9.667 టిఎంసిలకు గాను 7.991 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

శుక్రవారం ఎగువ ప్రాంతం నుండి జూరాలకు 1,15,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా… ప్రాజెక్టు 14 గేట్లు దిగువకు 95,566 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల కుడి, ఎడమ కాలువలు, బీమా లిప్ట్ 1, విద్యుత్ ఉత్పత్తికి, కోయిల్ సాగర్ సమాంతర కాలువలకు అన్నింటికీ కలిపి 1,27,659 క్యూసెక్కులకు వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతుండడంతో అక్కడి ప్రాజెక్టుల నుండి వస్తున్న వరద నీటితో జూరాల వద్ద జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జూరాల ప్రాజెక్టులపై ఆధారపడి నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News