Wednesday, August 20, 2025

భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. హెచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -

గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ప్రవాహంతో నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇక, భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ఉధృతితో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. ఈ క్రమంలో భద్రాచలం దగ్గర అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక, భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం 26 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News