- Advertisement -
కర్ణాటక జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి ఆదివారం 1,08,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో డ్యామ్ అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 81 వేల క్యూసెక్కులు బయటకు వెళ్తుండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 1,16,962 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. కాగా, జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 318.518 మీటర్లు ఉండగా… ప్రస్తుత నీటి మట్టం 317.650 మీటర్ల వద్ద ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థం 9.657 టిఎంసిలకు గాను ఇప్పుడు 7.933 టిఎంసిలు ఉన్నాయి.
- Advertisement -