నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బైలడిల ఐరన్ ఓర్ మైన్ కిరండూల్ కాంప్లెక్స్, బచేలీ కాంప్లేక్స్ దంతేవాడ, దోనిమలై ఐరైన్ ఓర్ మైన్‌లో పలు విభాగాల్లో ఖాళీలును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 995 వెకెన్సీల గాను నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: 995( ఫీల్డ్ అడెండెంట్(ట్రైనీ), మెయింటనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్/ మెకానికల్)ట్రైనీ, బ్లాస్టర్ గ్రూప్2(ట్రైనీ), ఎలక్ట్రీషియన్ గ్రూప్2(ట్రైనీ), ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్3(ట్రైనీ), హెచ్‌ఈఎం మెకానిక్/ ఆపరేటర్ గ్రూప్3(ట్రైనీ), ఎంసీఓ గ్రూప్3(ట్రైనీ), క్యూసీఏ గ్రూప్3 (ట్రైనీ), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఆటో ఎలక్ట్రీషియన్)
దరఖాస్తుకు చివరి తేది: 14 జూన్ 2025
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి అర్హత( టెన్త్, ఐటీఐ, బీఎస్సీ)
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం( ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగానికి రూ.31,850 జీతం, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.32,940 జీతం, ఇతర పోస్టులకు రూ.35,040 జీతం)
వయస్సు: 18- 30 ఏళ్ల లోపు ఉండాలి
ఉద్యోగ ఎంపిక విధానం: ఓఎంఆర్, కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nmdc.co.in/