Wednesday, September 3, 2025

విదేశీ వలసదారులకు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మతపరమైన హింస నుంచి తప్పించుకోడానికి భారతదేశానికి వచ్చిన వలసదారులకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గొప్పఊరట కల్పించింది.. 2024 డిసెంబర్ 31 కి ముందు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్లు , సిక్కులు, బౌద్ధులు,జైనులు, పార్సీలకు ప్రాసిక్యూషన్ బెదడ తప్పినట్లే. వారు పాస్ పోర్ట్ లేదా, ఎలాంటి ప్రయాణ పత్రాలు లేకున్నా దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.
గత సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ప్రకారం 2014 డిసెంబర్ 14 లేదా అంతకు ముందు మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వచ్చిన మైనారిటీ సభ్యులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
ఈ మధ్య అమలు లోకి వచ్చిన ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ముఖ్యమైన ఉత్తర్వు ఇది.

2014 తర్వాత భారతదేశంలోకి వలసవచ్చిన వారు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. వారికి ముఖ్యంగా
పాకిస్తాన్ నుంచి వలసవచ్చిన హిందువులకు ఉపసమనం కలిగిస్తుంది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం … ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో మైనారిటీ కమ్యునిటీకి చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు , క్రిస్టియన్లు – వారు మతపరమైన హింసకు భయపడి భారత దేశం లో ఆశ్రయానికి వచ్చి,
2034 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు పాస్ పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకున్నా, చెల్లుబాటు తేదీ దాటిపోయినా, వారందరికీ పాస్ పోర్ట్ లేదా వీసా కలిగి ఉండాలన్న నియమం నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ విషయాన్ని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News