- Advertisement -
మనతెలంగాణ/జహీరాబాద్‌ః రాఖీ పండగ సందర్భంగా జహీరాబాద్ డిపోకు గత సంవత్సరం కంటే రూ. 5,49,000 అధిక ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ టి. స్వామి తెలిపారు. ఈ సందర్బంగా రోఉకు 12 ప్రత్యేక స్పెషల్ బస్సులను నడిపినట్లు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం రాఖీ పండగ సమయంలో 1,73,846 మంది ప్రయాణీకులు బస్సుల్లో ప్రయాణించగా ఈ సంవత్సరం 1,76,416 మంది ప్రయాణించారని అంటే 2570 మంది అధికంగా ప్రయాణించినట్లు స్వామి వెల్లడించారు. రాఖీ పండగ రోజున ఉద్యోగుల కోసం ప్రత్యేక బోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ రాఖీ స్పెషల్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగుల కృషిని పై అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం డిపో సిబ్బంది సమిష్టి కృషి ఫలితమని స్వామి అన్నారు.
- Advertisement -