Thursday, May 8, 2025

కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం అనుమానితుల నివాసాల్లో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30 కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో పోలీసులు సోదా చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు , సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమిర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీ చేశాలు. 2021లోనే ఎన్‌ఐఏ అతడిని అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News