Thursday, July 31, 2025

టాన్స్ జెండర్ తో భర్త సహజీవనం… భార్య ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఓ వ్యక్తి భార్య పిల్లలను వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్ సహజీవనం చేస్తున్న సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజశేఖర్ అనే వ్యక్తికి భార్య పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి రాజశేఖర్, టాన్స్ జెండర్ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ విషయం తెలిసిన కూడా భర్త ఆస్పత్రికి రాకపోవడంతో అత్తమామలు అతడిని వెతకడానికి ప్రయత్నించారు. తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో రాజశేఖర్ కనిపించడంతో ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కలికాలం అంటే ఇదేనేమో అని నెటిజన్లు మండిపడుతున్నారు. భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్ తో తిరగడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News