- Advertisement -
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు భాస్కర్(40) భార్య నవ్య(32).. రెండు వారాల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర మనోవేదనకు గురై.. భార్య మృతిని తట్టుకోలేక భాస్కర్ సోమవారం సూసైడ్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో వారి పిల్లలు సుభాష్(8), మహాలక్ష్మి (4) అనాథలుగా మారారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -