Tuesday, August 12, 2025

పెళ్లికి ముందు రోజు మొదటి భార్యతో భర్త పరార్

- Advertisement -
- Advertisement -

తూర్పు గోదావరి: రెండో పెళ్లికి ముందే రోజు మొదటి భార్యతో లేచిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాదవోలు గ్రామానికి చెందిన పాలి సత్యనారాయణకు భీమోలు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం తెల్లవారుజామున పెళ్లి జరగాల్సి ఉండగా ఆదివారం సాయంత్రం పెళ్లి కుమారుడు మొదటి భార్యతో లేచిపోయాడు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో చేశారు. భర్త చనిపోయిన మహిళతో సత్యనారాయణ ఐదేళ్ల కిత్ర పెళ్లి చేసుకన్నాడు. ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మొదటి భార్య కుమార్తెకు కూడా అతడు వివాహం జరిపించాడు. రెండో పెళ్లి చేసుకుంటుండగా మొదటి భార్య బెదిరించడంతో ఆమెతో అతడు పారిపోయాడు. తొలి పెళ్లి విషయం దాచి రెండో పెళ్లి చేసుకోవడం తప్పేనని సత్యనారాయణ బంధువులు ఒప్పుకున్నారు. పెళ్లి కుమార్తెకు న్యాయం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News