వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన వరంగల్ పట్టణంలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రితీష్ సింగ్ తన భార్య రేష్మతో కలిసి వరంగల్ ఎనుమా ముల పోలీస్ స్టేషన్ పరిధిని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో రితిష్ సింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రేష్మకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉన్నదనే అనుమానంతో తరచుగా ఆమెతో గొడవపడేవాడు. వారం రోజుల క్రితం అతని భార్య ఓ వ్యక్తితో కలిసి ఎక్కడికో వెళ్లి వచ్చింది. దీంతో మరింత అనుమాన పడి శుక్రవారం ఉదయం ఆమెను అత్యంత దారుణంగా గొంతునులుమి హత్య చేశాడు. రితీష్ సింగ్ రేష్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడని తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎనుమాముల పోలీసులు తెలిపారు.
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
- Advertisement -
- Advertisement -
- Advertisement -