Friday, July 18, 2025

నా చావుకు భార్యే కారణం… భర్త సెల్ఫీ వీడియో రికార్డు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివాహం జరిగిన సంవత్సరానికే భర్త సెల్పీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉండవల్లి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య(29) సిసి కెమెరాల టెక్నీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం కౌసల్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దంపతులు అద్దె ఇల్లు తీసుకొని కలిసి ఉంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో పెద్దమనుషులు దంపతులకు నచ్చజెప్పారు. ఆషాడమాసం సందర్భంగా కౌసల్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. 15వ తేదీన బ్రహ్మయ్యకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె ఇంటికి వచ్చి పరిశీలించగా ఉరేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి తన భార్య కారణమంటూ తన ఫోన్ లో బ్రహ్మయ్య వీడియో రికార్డు చేశాడు. కౌసల్యకు వివాహేతర సంబంధం ఉండడంతోనే బ్రహ్మయ్య ఆత్మహత్య చేసుకన్నాడని అతడి ప్రమీల ఆరోపణలు చేసింది. వద్దు అని చెప్పినా కూడా యువతిని బ్రహ్మయ్యను పెళ్లి చేసుకున్నాడని, వివాహం జరిగిన మూడు రోజులకే తన భర్త చనిపోయాడని, ఇప్పుడు కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రమీల బాధతో కన్నీంటి పర్యంతమయ్యారు. తన కుటుంబం ఆగమైందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News