Wednesday, August 20, 2025

బాచుపల్లిలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాచుపల్లిలో ( విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి సంపులోకి దూకి ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేసింది. ఎనిమిది నెలల పసికందు, మూడేళ్ల బాబుతో కలిసి తల్లి ఈ పని చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News