- Advertisement -
హైదరాబాద్: మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ మరో భారీ మత్తు పదార్థాల రాకెట్ గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో (Hyderabad Bowenpally) మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసింది. పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీం పట్టుకుంది. మత్తు మందు తరలిస్తుండగా.. నలుగురు సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల నుంచే వీరంతా దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.కోటి విలువైన 7 కిలోల అల్ఫాజోలం, అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలు, ముడి సరకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.20 లక్షల నగదు, కల్లులో కలిపే పౌడర్ని కూడా సీజ్ చేశారు.
Also Read : పరిహారం కోసం పులి నాటకం… పెన్షన్ కోసం భర్తను చంపి…
- Advertisement -