Tuesday, June 17, 2025

హైదరాబాద్ సిపికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా సోమవారం పాత సిపీ కార్యాలయంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్తించిన పోలీస్ అధికారులు హుటాహుటిన సమీపంలోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అపోలో వైద్యులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యాకు చికిత్స చేశారు. కాగా తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అపోలో ఆస్పత్రిలో చేరానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. తనకు లోబీపి, స్పాండిలైటీస్ సమస్య ఉందని మంగళవారం మళ్లీ విధుల్లో చేరుతానని చెప్పారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News