మన తెలంగాణ/హైదరాబాద్: కొంతకాలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను బయటకు తెచ్చేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీ వే యాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి తెలంగాణ జిల్లా ల క్రికెట్ సంఘం అధ్యక్షు డు, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు అల్లీపురం బిసిసిఐ కార్యదర్శి దేవాజిత్ సైకియాకు మంగళవారం లేఖను ఈమెయిల్ చేరారు. ఈ లేఖలో హెచ్‌సిఎలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు.
2005 నుంచి హెచ్‌సిఎలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కోరా రు. తెలంగాణలో 31 గ్రామీణ జిల్లాలకు కలి పి 300 క్లబ్‌లకు సభ్యత్వం ఇచ్చేలా హెచ్‌సిఎను ఆదేశించాలని లేఖర లో విజ్ఞప్తి చేశారు. బిసిసిఐ నుంచి హెచ్‌సిఎ అందే నిధుల్లో 50 శాతం గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి కేటాయించేలా సహకారం అందించాలని అల్లీపురం ఆ లేఖలో కోరారు. అంతేగాక అవినీతి, అక్రమాలకు పాల్పడిన హెచ్‌సిఎ ఆఫీస్ బేరర్లపై జీవితకాల నిషే ధం విధించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.