- Advertisement -
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంబుడ్స్ మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్, హెచ్ సిఎ ఎథిక్స్ ఆఫీసర్ గా క భానును ఎన్నుకున్నారు.
హెచ్‌సిఎ స్కామ్ కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు చేసిన సందర్భంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్ సిఎ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. కొత్తగా 300 క్లబ్‌లకు అవకాశం ఇవ్వాలని టిసిజెఎసి డిమాండ్ చేస్తోంది. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టిసిజెఎసి మెంబర్స్ యత్నించగా పోలీసుల వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.
- Advertisement -