మన తెలంగాణ/హైదరాబాద్ : సెలవులను సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ కుటుంబాన్ని మృత్యువు ముద్దాడింది. సెలవులకు వెళ్లి సజీవదహనం అయిన షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఈ ప్రమాదంలో సజీవ దహనమైంది. ఈ ఘటన పెను విషాదం నింపింది. ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనం అయింది.
సెలవుల కోసం డలాస్కు వెళ్లిన ఆ కుటుంబం కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘోర రోడ్డు రోడ్గు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… సెలవుల్లో గడిపేందుకు హైదరాబాద్ నుంచి శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి డలాస్ వెళ్లింది. అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో శ్రీవెంకట్ కుటుంబంతో కలిసి వెళ్లాడు. అట్లాంటా నుంచి డాలస్‌కు తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రీన్‌కౌంటీ వద్ద రాంగ్రూట్లో వచ్చి కారును మినీ ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్‌కు పంపారు.
మృతులు హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు, వారి ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. డిఎన్ఎ శాంపిల్స్ తీసుకుని మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన గురించి తెలిసి శ్రీవెంకట్ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, హైదరాబాద్‌ని సుచిత్రలో శ్రీవెంకట్ కుటుంబం నివాసముంటోంది.