Sunday, May 18, 2025

దేశానికి సమస్య వస్తే భాగ్యనగరం ముందుండాలి

- Advertisement -
- Advertisement -

పాక్ కవ్వింపును దీటుగా తిప్పికొట్టిన
భారత సైనికులు ఆపరేషన్ సిందూర్
శాంపిల్ మాత్రమే భారత్ తీరు
ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే
తిరంగా ర్యాలీలో వక్తల ఉద్ఘాటన

మన తెలంగాణ/హైదరాబాద్: పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు, అక్కడకు భారీగా చేరుకున్న యువత, విద్యార్థులు, ఆర్మీ రిటైర్ అధికారులు, మహిళలు బీజేపీ శ్రేణుల మధ్య ఉత్సాహం కనిపించింది. బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని అన్నారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మన సైన్యం దెబ్బ ఏంటో చూపించి పాకిస్తాన్ తోక వంకర చేసిందని అన్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని అన్నారు. ఈ యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించామని, సైన్యంలో మన ఆయుధాలతో నిండిపోయిందని తెలిపారు. టెర్రరిస్టులు ఎప్పుడైతే దాడి చేశారో అప్పటికే మన సైన్యం మొత్తం మన ఆయుధాల వాడకంపై పూర్తి పట్టు తెచ్చుకుందని తెలిపారు. ఈ యుద్ధంలో ఆకాష్ క్షిపణిని వాడారని వివరించారు. వాళ్ళ ప్రతి చర్యలను మనం ధ్వంసం చేయగలిగామని, మన దగ్గర చాలా గొప్ప ఆయుధాలు, క్షిపణులు ఉన్నాయని తెలిపారు. భారతదేశానికి ఏదైనా సమస్య వస్తే భాగ్యనగరం ముందుండాలని కిషన్ రెడ్డి కోరారు.

హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: విద్యాసాగర్‌రావు

ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. ఈ ర్యాలీ భారత్ మతాకి జై నినాదాలతో మార్మోగుతూ ట్యాంక్ బండ్ పరిసరాలను మరింత ఉత్సాహంగా మార్చింది. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ శక్తులు వారికి ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు ముగింపు పలకాలని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జేజేలు కొట్టాలన్నారు.

ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువుగా ఉన్న ఇండియా, ఇప్పటికీ ఏ దేశంపై యుద్ధానికి కాలు దువ్వలేదన్నారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఎదురు దాడి చేసినట్లు పాకిస్థాన్‌పై దాడి గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంతో వ్యవహరించారని, భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉందని పేర్కొన్నారు. ఈ ర్యాలీ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ప్లాప్ చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తిరంగ్ ర్యాలీలో జరిగిన తోపులాటపై కూడా స్పందించారు. తోపులాటలో మందకృష్ణ మాదిగ కాలికి గాయం కావడంతో ఆయనను వెంటనే ర్యాలీ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News