72వ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి మరో రెండు రోజుల్లో వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్‌వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెన్నా క్రాస్బీ(అమెరికా), ఎమ్మా మోరిసన్(కెనడా), వాలేరియా కాన్యావో(వెనిజులా), వంటి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వారం రోజులుగా వస్తున్న అతిథులందరినీ తెలంగాణ సంస్కృతీ,
సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ టూరిజం శాఖ వారికి వసతి సౌకర్యాలను కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. కాగా పోటీల్లో పాల్గొనే కంటెస్టంట్లు రెండు రోజులు ముందుగానే రిహార్సల్స్‌లో పాల్గొనున్నారు. పోటీ దారులను వివిధ గ్రూపులుగా చేసి పాల్గొనబోయే కార్యక్రమాల గురించి వారికి ముందస్తుగా నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన కంటెస్టంట్లు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. బ్రెస్ట్ క్యానర్ నివారణపై మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను మిస్ట్ వరల్డ్ కంటెస్ట్‌లో భాగంగా చేపడుతున్నారు.