- Advertisement -
హైదరాబాద్: మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంద ఫీట్ రోడ్ లో బైక్ ను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందారు. దీపక్(28) బైక్ పై వెళ్తుండగా ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వరంగల్ జిల్లా పరకాల మండలం పులిగిల్స్ గ్రామానికి చెందిన వాడని పోలీసులు ప్రకటించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -