Friday, May 16, 2025

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనిష్ఠ ధర రూ.10 నుండి రూ.12కు పెంచింది. అంతేకాకుండా గరిష్ఠ ధర రూ.60 నుండి రూ.75కు పెంచింది. రెండు కిలోమీటర్ల నుండి నాలుగు కిలోమీటర్ల వరకు రూ. 18, నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు గా ఎల్ అండ్ టి చార్జీలను సవరించింది.

పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. మెట్రో చార్జీల పెంపుపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ప్రతిరోజూ వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే చాలా మంది బైకులు, బస్సుల్లో ప్రయాణించకుండా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల మెట్రో సమాయాన్ని కూడా పెంచుతూ ఎల్‌అండ్టీ నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి నుండి మెట్రో నష్టాల్లో ఉందని చెబుతున్న సంస్థ చార్జీలను పెంచి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.

కొత్త ఛార్జీలు ఇవే:
* 2 కి. మీ ల వరకు కనీస ఛార్జీ రూ. 12
* 2- నుండి 4 కి. మీ. వరకు రూ.18
* 4- నుండి 6 కి. మీల వరకు రూ.30
* 6- నుండి 9 కి. మీల వరకు రూ.40
* 9- నుండి 12 కి. మీ.ల వరకు రూ.50
* 12 నుండి -15 కి.మీల వరకు రూ.55
* 15- నుండి 18 కి. మీల వరకు రూ.60
* 18- నుండి 21 కి.మీల వరకు రూ.66
* 24 కీ.మీటర్లు, ఆపైన రూ. 75

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News