హైదరాబద్: ఈ మధ్యకాలంలో ప్రియుడితో కలిసి భర్తలను హతమారుస్తున్న భార్యల గురించి తరచూ వింటూనే ఉన్నాం. కొందరు పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం కారణంగా భర్తలను హత్య చేస్తుంటే.. మరికొందరు పెళ్లి తర్వాత వివాహేత సంబంధం పెట్టుకొని భర్తలను కడతేరుస్తున్నారు. తాజాగా నగరంలోని సరూర్‌నగర్ (Hyderabad Saroornagar) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. కోదండరామ్‌నగర్‌లో ప్రియుడు హరీశ్‌తో కలిసి భార్య.. భర్తను చంపేసింది.
నాగర్‌కర్నూల్‌కు చెందిన శేఖర్, చిట్టిలకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం వీరిద్దరు హైదరాబాద్.. సరూర్‌నగర్‌కు (Hyderabad Saroornagar) వచ్చి జీవిస్తున్నారు. శేఖర్ ప్రైవేటు డ్రైవర్ కాగా.. చిట్టి ఇళ్లలో పని చేసేది. తాజాగా భర్త శేఖర్ వివాహేతర సంబంధం గురించి చిట్టిని నిలదీయడంతో అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నింది. అర్థరాత్రి ప్రియుడు హరీశ్‌ని ఇంటికి పిలిపించి నిద్రలో ఉన్న భర్తను హత్య చేసింది. ఆ తర్వాత 100కు ఫోన్ చేసి నిద్రలోనే భర్త చనిపోయాడని భార్య చెప్పింది. అయితే పోలీసులకు భార్యపై అనుమానం రావడంతో తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో విచారణలో భార్య చిట్టి నేరం అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న చిట్టి ప్రియుడు హరీశ్ గురించి పోలీసులు గాలిస్తున్నారు.
Also Read : అటవీ శాఖ మంత్రి మేనకోడలను చంపేసి… భర్త ఆత్మహత్య?