హైదరాబాద్: భారతదేశంలో డిజైన్, కళలు, భవిష్యత్తు ఆలోచనలకు ప్రముఖ వేదికగా ప్రసిద్ధి చెందిన డిజైన్ డెమోక్రసీ సెప్టెంబర్ 5–7 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న డిజైన్ డెమోక్రసీ లో ప్రదర్శనలు, చర్చలు, ఇన్‌స్టాలేషన్‌లు మరియు క్యూరేటెడ్ అనుభవాలలో 120 కి పైగా ప్రముఖ బ్రాండ్‌లు, 80 కు పైగా ప్రభావవంతమైన స్పీకర్లు మరియు 15,000 కు పైగా సందర్శకులు పాల్గొననున్నారు. భారతీయ డిజైన్ భవిష్యత్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్వహించబోతున్న ఈ ఉత్సవం, దేశంలోని సృజనాత్మక కేంద్రంగా హైదరాబాద్‌ను మార్చనుంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ప్రొడక్ట్ డిజైన్, ఆర్ట్ , విజువల్ కల్చర్‌లోని నిపుణులను ఏకతాటి పైకి తీసుకురానుంది.
ఈ డిజైన్ డెమోక్రసీ ప్రదర్శనలో ఫర్నిచర్, లైటెనింగ్, ఫ్లోరింగ్, హోమ్ ఫర్నిషింగ్స్, కిచెన్ & బాత్ , డెకర్ యాక్ససరీలు, ఫైన్ ఆర్ట్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో మూడు పెవిలియన్స్ : అట్లియర్, కాన్వాస్, మూస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కళలు, డిజైన్, సంస్కృతికి ప్రతీకగా ఉంటాయి. ఈ ప్రదర్శనలో జైపూర్ రగ్స్, ది చార్ కోల్ ప్రాజెక్ట్, ఫజో ప్రాజెక్ట్, శైలేష్ రాజపుట్, ఏకెఎఫ్ డి+, అనంతయ, వితిన్, రవిష్ వోహ్రా హోమ్స్, ఏక్ కళాకార్ , ఏహెచ్ఎం సింగపూర్ వంటివి పాల్గొంటున్నాయి.
ఈ సందర్భంగా డిజైన్ డెమోక్రసీ సహ వ్యవస్థాపకురాలు శైలజ పట్వారి మాట్లాడుతూ ఆర్థిక, నిర్మాణశైలి పరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ సమకాలీన డిజైన్ ఫోరమ్ కు సరైన వేదికగా నిలుస్తుందని అన్నారు. అందానికి సంబంధించినంత వరకూ నిశ్శబ్ద భాష డిజైన్. ఇది ఒక ప్రాంగణాన్ని అద్భుతమైన అనుభూతిగా మార్చగలదు అని సహ వ్యవస్థాపకులు పల్లిక శ్రీవాస్తవ్ అన్నారు.
డిజైన్ డెమోక్రసీ అనేది ప్రదర్శనలు, సంభాషణలు, సహకారాల ద్వారా డిజైన్ కమ్యూనిటీతో సన్నిహితంగా ఉండటానికి సృష్టించబడిన వేదిక. ఇది సృష్టికర్తలు, వినియోగదారులు, పెద్ద పర్యావరణ వ్యవస్థ మధ్య సంబంధాలను నిర్మించడం చేస్తోంది ” అని సహ వ్యవస్థాపకుడు & క్యూరేటర్ అర్జున్ రాఠి అన్నారు. ఈ ప్రదర్శనలో అంతర్భాగంగా సెప్టెంబర్ 5-6 తేదీలలో రెండు రోజుల పాటు డిడి టాక్స్ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. రెజా కాబూల్, సుసానే ఖాన్ , అక్షత్ భట్ సహా దాదాపు 80 మంది వక్తలు భారతదేశపు డిజైన్ భవిష్యత్ గురించి మాట్లాడనున్నారు.
ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా డిజైన్ హౌస్ కు చెందిన సుప్రజ రావు క్యురేట్ చేయగా ‘మ్యూజియం అఫ్ తెలంగాణ’ , అబిన్ డిజైన్ స్టూడియో కు చెందిన అబిన్ చౌదరి, స్నేహశ్రీ నంది క్యురేట్ చేసిన ‘గ్యాలరీ అఫ్ సస్టైనబిలిటీ’ తో పాటుగా ఫాడ్ స్టూడియో కు చెందిన ఫరా అహ్మద్ క్యురేట్ చేసిన ‘ప్రెసియస్ ఆబ్జెక్ట్స్’ , న్యూడ్స్ నుంచి నురు కరీం క్యురేట్ చేసిన ‘ఫ్లో’ నిలువనున్నాయి. ఇవి మాత్రమేనా, కళలు, కాంతులు , రుచులు సమ్మేళనంగా నిలిచే డిజైన్ డెమోక్రసీ, వారసత్వం, వ్యవస్ధాపకతకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని దక్షిణ భారత దేశపు సృజనాత్మక రాజధానిగా నిలుపనున్నది.