హైదరాబద్: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం తిని ఓ వ్యక్తి మృతి చెందగా.. ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలోని (Hyderabad Vanastalipuram) చింతల్‌కుంటలో చోటు చేసుకుంది. చింతల్‌కుంటలోని ఆర్‌టిసి కాలనీలో ఉండే శ్రీనివాస్ యాదవ్(46) ఆదివారం బోనాల పండగ సందర్భంగా ఇంటికి మటన్ బోటి, చికెన్ తీసుకొచ్చారు. ఆ రాత్రి వండుకొని కుటుంబసభ్యులతో తిన్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. సోమవారం ఉదయం ఆ మాంసాన్ని వేడి చేసి మళ్లీ తిన్నారు. దీంతో ఆహారం విషపూరితం అయ్యింది. ఫలితంగా కుటుంబసభ్యులందరికీ వాంతులు వీరేచనాలు అయ్యాయి. వెంటనే అందరూ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం తిని.. ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -