మనతెలంగాణ సిటీ బ్యూరో: నాలాలు పొంగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించారు. నాలాలకు ఉన్న ఆటంకాలన్నీ తొలగితే చాలా వరకు ముంపు సమస్య తలెత్తదని కమిషనర్ పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం పరిశీలించారు.
నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడల్లా మూసీ నీటి ప్రవాహానికి కంటే.. ఎక్కువ కూకట్‌పల్ల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని గుర్తించినట్టు కమిషనర్ వెల్లడించారు. ఈ రెండు నాలాలు సాఫీగా సాగిపోవడంతో భరత్‌నగర్ , మూసాపేట్, బాలానగర్, దీన్‌దయాల్‌నగర్, వినాయక్‌నగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాలు నీట మునుగుతున్నాయనీ, ఈ ఏడాది ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.