Thursday, May 22, 2025

రెండు రోజుల్లో ఆ సమస్యని పరిష్కరిస్తాం: హైడ్రా కమీషనర్

- Advertisement -
- Advertisement -
  • అక్రమార్కుల గుండెల్లో గుబులు

మన తెలంగాణ/బోడుప్పల్: మేడిపల్లి మండలం పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో అనేక అక్రమాలపై హైడ్రా‌కి(Hydra) ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుధవారం రెండు కార్పొరేషన్‌లలో సంబంధిత అధికారులతో పర్యటించారు. ఫిర్యాదు దారుల నుండి వచ్చిన సమస్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నంబర్ 1లో మైనారిటీ గ్రేవ్ యార్డ్ ఆక్రమించి నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మైనారిటీ గ్రేవ్ యార్డ్ లో ఎలా నిర్మాణాలు జరిగుతున్నాయని స్థానిక అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైడ్రా(Hydra) అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు, బాధితులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News