Saturday, May 24, 2025

రూ.200 కోట్ల భూమికి విముక్తి

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్‌లో అక్రమ నిర్మాణాల
భరతం పట్టిన హైడ్రా ఇంట్లో
కిరాయికి వచ్చి రోడ్డు, నాలా
ఆక్రమణ హాస్టల్ భవనం, కారు
మెకానిక్ షెడ్డు నిర్మాణం
రెండెకరాల పార్కుకు దారినే
మూసేసిన ఘనుడు 907 చదరపు
అడుగుల మేరకు ఆక్రమించినట్లు
హైకోర్టు ధ్రువీకరణ

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్‌లో రూ. 200 కోట్ల విలువచేసే భూమిని హైడ్రా కాపాడింది. అత్యంత ఖ రీదైన ఈ ప్రాంతంలో రెండు ఎకరాల పార్కు స్థలాన్ని క బ్జా చేశారన్న ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా శుక్రవారం ఆక్రమణలను కూల్చివేసింది. రోడ్డు నంబర్ 41లో రోడ్డు తో పాటు నాలాను ఆక్రమించి నిర్మించిన గోడలను నేలమట్టం చేసి కాలువలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ సొసైటీ ప్రతినిధులు, అక్కడ నివా స ప్రాంతాలకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో ఇది వరకే పరిశీలించారు. నాలాతోపాటు రోడ్డును ఆక్రమించి నిర్మాణా లు చేసినట్టు నిర్ధారణ కావడంతో వాటి తొలగింపునకు హైడ్రా నోటీసులు గతంలోనే ఇచ్చింది. కోర్టు నుంచి అనుమతులు లభించడంతో బుధవారం అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది.

కిరాయికి వచ్చిన ఓ వ్యక్తి కబ్జాలు చేసినట్టు హైడ్రా గుర్తించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 41లో అవసరాల శ్రీనివాస్, రుక్మాంద్గ రావుకు 1000 చ. గ.ల స్థలం ఉంది. ఇందులో 200 చ.గ.ల వరకు ఇల్లు క ట్టారు. ఈ ఇల్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి చేరువలో ఉం ది. క్రోతుపల్ల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటికి ప్రక్కనే ఉన్న 30 అడుగుల మేర రోడ్డు ఉంది. ఈ రోడ్డు మార్గంలో వెళ్తే 2 ఎకరాల పార్కుకు చేరుకోగలం. కాని ఆ దారినే మూసేశాడు కిరాయిదారుడు. దీంతో ఆ పార్కుకు దారి లేకుండాపోయింది. 30 అడుగుల మేర ఉన్న రోడ్డులోనే బాక్సు టైపు నాలా ఉంది. నాలాతో పాటు రోడ్డును సగం వరకు ఆక్రమించేశారు. ఇంటి ఖాళీ స్థలంంతో పాటు ప్రక్కనే ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి హాస్టల్ నిర్మించాడు. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థ్లంలో కారు మరమ్మతుల షెడ్డును ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చాడు. మొత్తం 907 చ.గ.ల మేర ఆక్రమణలకు పాల్పడ్డాడు. వాటిని అద్దెకు ఇచ్చి నెలకు రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ ఇంటి ఓనర్‌కు సంబంధం లేకుండా జరిగిపోయాయి.

కిరాయిదారుడిని తప్పు పట్టిన కోర్టు..
——ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుపై కిరాయిదారుడు హైకోర్టును ఆశ్రయించారు. (రిట్ పిటిషన్ నెం.10831 ఆఫ్ 2025). రోడ్డును, నాలాను ఆక్రమించి ఎలా నిర్మాణాలు చేస్త్తారంటూ కిరాయిదారుడుని కోర్టు పరిశీలించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన కిరాయిదారుడు చేస్తున్న వాదనలను హైకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలున్నాయని ఇంటి ఓనర్‌ను కోర్టు అడిగింది. తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడంతో ఆక్రమణను తొలగింపునకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా అక్కడ నిర్మించిన హాస్టల్ భవనాన్ని, కారు మెకానిక్ షెడ్డును తొలగించింది.

పార్కుకు దారి చూపిన హైడ్రా..
——జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 41 ఎటు చూసినా వ్యాపార సముదాయాలు ట్రాఫిక్ రద్దీతో ఎక్కడా నిల్చోడానికి కూడా స్థలంలేని ప్రాంతం. అలాంటి చోట 2 ఎకరాల మేర పార్కు ఉంటే ఎంత ప్రయోజనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డును ఆ్రక్రమించి కిరాయిదారుడు నిర్మించిన కబ్జాలను హైడ్రా తొలగించడంతో ఇప్పుడు పార్కుకు దారి దొరికింది. ఇప్పుడా 2 ఎకరాల పార్కును జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.. ఆ పార్కు అందుబాటులోకి వేస్తే అక్కడ ఎంతో మందికి ప్రాణవాయువు అందుతుంది. పార్కుకు దారి లభించడంతో స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News