దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని చాకచక్యంగా కాపాడిన హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది తిరుపతియాదవ్, సంతోష్‌చారి, మహ్మద్ ఇమ్రాన్‌లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. ఈ నెల 25న రామిరెడ్డి అనే యువకుడు దుర్గంచెరువు తీగల వంతెన అంచున నిలబడి చెరువులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అక్కడే విధుల్లో ఉన్న డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడిన విషయం అందరికీ విధితమే. రామిరెడ్డిని మాటల్లోపెట్టి.., దృష్టి మరల్చి.. క్షణాల్లో కాపాడిన తిరుపతియాదవ్‌ను కమిషనర్ అభినందించారు. అక్కడే విధుల్లో ఉండి.. యువకుడిని కాపాడేందుకు సహకరించిన సంతోష్ చారి, మహ్మద్ ఇమ్రాన్‌లను కూడా శాలువ కప్పి సన్మానించారు. దుర్గం చెరువు వంతెనపై వీరు నిలుచుండగా.. రంద్రాలను శుభ్రం చేస్తున్నప్పుడు ఓ యువకుడు దూకేందుకు యత్నిస్తున్న దృశ్యాలను చూశామని.. ఒకవైపు అతిడిని దూకకుండా మాటల్లో పెట్టి… మరో వైపునుంచి వచ్చి కాపాడినట్టు ఆ ముగ్గురు డీఆర్ ఎఫ్ ఉద్యోగులు కమిషనర్‌కు వివరించారు.
యువకుడి ప్రాణాలు కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
- Advertisement -