ప్రభుత్వ భూములు, చెరువుల
ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలో లే అవుట్లు
వేస్తే శిక్ష తప్పదు లే అవుట్లలోని
రోడ్లను ప్లాట్లుగా మార్చి విక్రయించినా
ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు
చేపడితే కేసు పెడతాం హైడ్రా
కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వ భూము ల్లో, చెరువుల ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్లలో, లేఅవు ట్లు వేసినా, రోడ్లను ప్లాట్లుగా చేసి విక్రయించినా సదరు రియల్టర్ల ఆస్తులను అటాచ్ చేస్తామని హై డ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. అ క్రమంగా ప్లాట్లను అమ్ముకుని, కొనుగోలు చేసిన వారిని మోసం చేసి వెళ్ళిపోయి.. ఆ ప్లాట్లకు తమ కు సంబంధం లేదని బుకాయిస్తే హైడ్రా ఊరుకోదని, అటువంటి వారి ఆస్తులను అటాచ్ చేయడానికి వెనుకాడబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం తన చాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిఆర్‌పి చాప్టర్ 18లోని సెక్షన్‌ల ప్ర కారంగా ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లను విక్రయిం చి.. వచ్చిన నిధులతో మరో చోట కొనుగోలు చేసి నభూములను,ఆస్తులను అటాచ్ చేస్తామనిస్ప ష్టం చేశారు.
లేఅవుట్లలోని రోడ్లను, పార్కులను, యుటి లిటీ స్థలాలను ప్లాట్లుగా చేసి విక్రయించే వారిపై కే సులు పెడతామని తేల్చిచెప్పారు. ప్రస్తుతం హైడ్రా పోలీసుస్టేషన్ తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని, పోలీసుస్టేషన్‌కు మంజూరైన ఒక ఏసిపి, 6 సిఐలు, 12 ఎస్‌ఐలు, 30 మంది పోలీసు కానిస్టేబుళ్లు కాగా ప్రస్తుతం ఇందులో సగం వరకు జాయిన్ అయ్యారని, అయితే మిగతా వారిని కూ డా ఇవ్వాలని డిజిపికి విన్నవించనున్నట్టు రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతమున్న వారితో పోలీసుస్టేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తామని, ఈ స్టేషన్‌లో అయ్యే కేసులను 9వ మెట్రోపాలిటన్ కోర్టు, నాం పల్లిలో విచారణ జరుగుతుందని వెల్లడించారు.
కమిషనర్ సిఫారసుతోనే కేసులు..
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై హైడ్రా పోలీసుస్టేషన్‌లో నేరుగా కేసులు నమోదు చేయడం ఉండదని, కమిషనర్ దృష్టికి వచ్చిన అనంతరం ప్రాథమిక విచారణ చేసి వాస్తవాలను గుర్తించిన మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజల నుంచి ఫి ర్యాదులు వచ్చినప్పుడు వాటిపై విచారణ చేపట్ట డం, వాస్తవాలను
గ్రహించడం, నిజనిర్థారణకు వచ్చిన అనంతరమే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. చెరువుల్లో ఘన వ్యర్థాలను డంప్ చేస్తూ, చెరువును ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతూ ఉంటే.. రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థ లాలు కబ్జా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినప్పుడు నేరుగా కే సులు నమోదు చేయడం జరుగుతుందని రంగనాథ్ వివరించా రు. సంతకాలను ఫోర్జరీ చేసి, డాక్యుమెంట్స్ ప్యాబ్రికేట్ చేసి ప్ర జలను మోసం చేస్తే కూడా విచారణ అనంతరం కేసులు న మోదు చేస్తామని ఆయన తెలిపారు.
సాధారణంగా శాంతిభద్రతల తరహాలోనే హైడ్రా పోలీసుస్టేషన్‌గా పనిచేస్తుందన్నారు. హైడ్రా ముఖ్యంగా రోడ్లు, వీధులు, పార్కులు, ప్రభుత్వ భూము లు, నీటివనరులు, నాలాలు, ఫుట్‌పాత్‌లు వంటి వాటిని ఆక్రమించినా, వాటిల్లో నిర్మాణాలు చేపడుతున్నా.. చర్యలు తీసుకోవడం, కఠినంగా వ్యవహరించడం పట్ల రాజీ ఉండబోదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను కూల్చడమే కాదు.. నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపడతామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని చెరువులను ఎంపికచేసి ఆహ్లాదకరమైన సరస్సులుగా తీర్చిదిద్దుతున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది డ్రీమ్ ప్రాజెక్టు అని, చెరువులను ఇలా కూడా అభివృద్ధి పునరుద్దరించొచ్చా.. అనే విధంగా తయారు చేస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు.
ఈ చెరువులకు హెచ్‌ఎండిఏ నుంచి నిధులు మంజూరవుతున్నాయని, చెరువులను పునరుద్ద్ధరిస్తే ఇలా మారుతాయా.. అనే తరహాలో టూరిస్ట్ స్పాట్‌లుగా, నగర ప్రజల యాంత్రిక జీవనపు వత్తిళ్ళను దూరం చేసేట్టుగా మార్చుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. చెరువుల చెంతన ఉన్న స్థానికుల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు మద్దతునిస్తున్నారని ఆయన తెలిపారు. బతుకమ్మకుంట చెరువును, ప్రస్తుతం మేమే పొజిషన్‌లో ఉన్నామని, కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు స్టే వచ్చే సమయానికి బతుకమ్మకుంటను స్వాధీనం చేసుకుని అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.