Thursday, May 22, 2025

మేడిపల్లిలో నిన్న హామీ…నేడు యాక్షన్

- Advertisement -
- Advertisement -

గ్రేవ్ యార్డ్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రాధికారులు

మన తెలంగాణ/బోడుప్పల్ : మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో హైడ్రా కమిషనర్ పర్యటించిన మరుసటి రోజే మైనార్టీల గ్రేవ్ యార్డ్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ లో పర్వతాపూర్ సర్వే నంబర్ 1 లోని మైనార్టీల గ్రేవ్ యార్డ్ ను పరిశీలించారు. రెవ్యెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో మైనార్టీల గ్రేవ్ యార్డు అక్రమణకు గురైనట్టు నిర్ధారించుకొని రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా సిఐ సైదులు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇండ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి అక్కడ నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేవ్ యార్డ్ భూమిని కాపాడాలని పలువురు అధికారులకు, నాయకులకు బాధితులు మొర పెట్టుకున్న ఎవరు పట్టించుకోవలేని వాపోయారు. మైనార్టీల గ్రేవ్ యార్డులో అక్రమ నిర్మాణాలను తొలగించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News